Rains In Delhi : ఢిల్లీలో భారీ వ‌ర్షం.. గోడ కూలి వాహ‌నాలు ధ్వంసం!

Rains In Delhi : దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసిన జలమయమే కనిపిస్తుంది.. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌,

Update: 2020-08-19 12:17 GMT
Rains in Delhi Wall Collapses and Several Cars Damaged in Saket

Rains In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసిన జలమయమే కనిపిస్తుంది.. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజిమాబాద్‌ మొదలగు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి.. దీనితో ప్రధాన రహదారులు అన్ని చేరువులను తలపించాయి.. ఇక పలు చోట్లల్లో ట్రాఫిక్ ఏర్పడింది.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అయితే భారీ వర్షాల కారణంగా సాకేత్ ఏరియాలోని జే బ్లాక్‌లో ఓ గోడ కూలింది.

దీంతో ఆ గోడ పక్క ఉన్న వాహనాలు మొత్తం ద్వంసం అయిపోయాయి.. గోడ శిథిలాల‌న్నీ ఆ కార్లపై ప‌డ్డాయి. దీనితో వెంటనే సమాచారం అందుకున్న పోలిసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసే పనిలో పడ్డారు.. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధౌలా కువాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం మాయాపురి చౌక్‌ ద్వారా వెళ్లాలని ట్విటర్‌లో వెల్లడించారు.. ఇక దేశ రాజధానిలో ఆగస్టు 25 వ‌ర‌కు రోజులు ఉన్నట్టుగా వాతావ‌ర‌ణ‌శాఖ వెల్లడించింది.. అక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉందని పేర్కొంది.

Tags:    

Similar News