Bharat Jodo Yatra: చిత్రదుర్గ జిల్లా హర్తికోట్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం
Bharat Jodo Yatra: పెద్ద ఎత్తున పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా కొనసాగుతుంది. ఇవాళ భారత్ జోడో యాత్ర 34వ రోజుకు చేరుకుంది. చిత్రదుర్గ జిల్లా హర్తికోట్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్‌గాంధీకి భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు స్థానికలు, కార్యకర్తలు. చిత్రదుర్గ జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
పెద్దలకు పలకరింపులు, పిల్లలతో ముచ్చట్లతో కర్ణాటకలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంట వస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, మాజీ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు.
చిన్నారులు, పెద్దలు రాహుల్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇప్పటివరకు 867 కిలోమీటర్లు చేరుకుంది. ఇక మొత్తం 12 రాష్ట్రాల్లో సాగే జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది.