మాజీ ప్రధాని ఇందిరాకి రాహుల్ నివాళి!
కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి నేడు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమెకి నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి నేడు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమెకి నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 'మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. అధికారానికి ప్రతిరూపమైన ఆమె సమర్థవంతమైన ప్రధానమంత్రి. ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతున్నది. నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయని' ట్వీట్ చేశారు.
ఇక ఇందిరాగాంధీ విషయానికి వచ్చేసరికి భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దంపతులకి 1917, నవంబర్ 19న జన్మించారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికైనా ఇందిరా 1964-66 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి మరణం తర్వాత 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు ప్రధానిగా కొనసాగారు. దేశానికి మొదటి మహిళా ప్రధాని ఆమె కావడం విశేషం. దేశంలో అనేక సంస్కరణలకు ఆధ్యంపోసిన ఇందిరాగాంధీ 1984, అక్టోబర్ 31న ఆమె బాడీ గార్డులు ఆమెను కాల్చి చంపారు.