Parliament Session: పార్లమెంట్‌లో ‘నీట్’ రగడ.. ధర్మేంద్ర ప్రధాన్ పై రాహుల్ ఫైర్
Monsoon Parliament Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలిరోజే నీట్ కేంద్రంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.
Monsoon Parliament Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలిరోజే నీట్ కేంద్రంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. సభ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. విపక్షం తరుపున కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీలు ప్రశ్నలు సంధించగా... విపక్ష సభ్యుల ప్రశ్నలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు.
నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమస్యను మూలాల నుంచి పెకిలించాల్సి ఉందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారని... డబ్బునోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. డబ్బులు ఉన్న వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారుని ఆరోపించారు. పేపర్ లీక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.