Private Trains in India: పట్టాలెక్కనున్న ప్రైవేటు రైళ్లు.. కేంద్రం నిర్ణయం !
Private Trains in India: రైల్వేలో సైతం ఇక నుంచి ప్రైవేటుకు తెరలేచింది.
Private Trains in India: రైల్వేలో సైతం ఇక నుంచి ప్రైవేటుకు తెరలేచింది. తాజాగా దీనికి సంబంధించిన ప్లానింగ్స్ వెల్లడి చేయడంతో ప్రైవేటు రైళ్ళు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తొలుతగా 109 రూట్లలో ఈ రైళ్లు నడిచేలా అధికారులు నిర్ణయించారు.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్లానింగ్స్ బుధవారం అఫిషియల్ గా వెలువరించింది. ఈ మేరకు 109 రూట్లలో 151 మోడరన్ ట్రైన్స్ రాకపోకల కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆహ్వానించినట్టు అనౌన్స్ చేసింది. ఈ మేరకు 109 రూట్లలో ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం రిక్వెస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ను ఇవ్వాలని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో ప్రైవేటు కంపెనీలు రూ.30వేల కోట్లకుపైగా ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టనున్నట్టు తెలిపింది.
అయితే ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థలే.. రైళ్ల ఆర్థిక, నిర్వహణ ఖర్చులు భరించాలని భారతీయ రైల్వే స్పష్టం చేసింది . వీటితో పాటు రైళ్లను నడపడానికి అవసరమయ్యే విద్యుత్ ఛార్జీలు, వాణిజ్య ఛార్జీలు, ఇంధనం వంటి ఖర్చులను కూడా ప్రైవేటు సంస్థలే చెల్లించాలని వివరించింది.
ప్రపంచంలోనే మన రైల్వేస్ కు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పెద్ద సంస్థగా పేరుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ee నిర్ణయంతో రైల్వే లో ప్రయివేట్ భాగస్వామ్యం పెరిగే సూచనలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ సంస్థ నుంచి ప్రయివేటు దిశలో రైల్వేస్ పరిగెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి చాలా ఏళ్లుగా రైల్వేలో ప్రైవేట్ పరుగుఅల్ కోసం ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి కార్యరూపం సాధిస్తున్నాయి.