PM Modi to Address the Nation: శనివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
PM Modi to Address the Nation: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్న అనుకున్న స్థాయిలో ఫలాలను సాధించలేకపోతున్నాయి.
PM Modi to Address the Nation: మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్న అనుకున్న స్థాయిలో ఫలాలను సాధించలేకపోతున్నాయి. సడలింపుతో ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ప్రజలు బయటకు రావడం వల్ల పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆగష్టు 1న శనివారం నాడు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు..
ఈ ప్రసంగంలో ప్రధాని పలు అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020' గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంధర్బంగా నూతన విద్యా విధానంపైనా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. అదేవిదంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో మాట్లాడనున్నారు. విద్యార్ధులలో నైపుణ్యం పెంపొందించడంలో భాగంగా 2017 నుండి 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం ప్రారంభమైన తోలి ఏడాదే సుమారు 42వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా 2019కి ఆ సంఖ్య సుమారు 2 లక్షలకు పెరిగింది. అయితే, ఈ ఏడాది తోలి రౌండ్ కే సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే విదంగా మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. (10+2+3) స్థానంలో (5+3+3+4) విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు.
ఇక అటు భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులుపెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 16 లక్షల 38 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కేసులు నమోదు కాగా, 779 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 37,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 16,38,871 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,45,318 ఉండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 35,747 మంది కరోనా వ్యాధితోమరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54 శాతంగా ఉంది.