Corona Vaccination: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో మోడీ ఫొటో తొలగింపు

Corona Vaccination: అభ్యంతరం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ

Update: 2021-03-11 11:56 GMT

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Corona Vaccination: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలితప్రాంతంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై నరేంద్రమోడీ చిత్రాలు ప్రచురిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది.

దీంతో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోడీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేర కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు రాసిన లేఖలో మోడీ ఫోటో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News