Delhi: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

Delhi: ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో క్షీణించిన గాలి నాణ్యత

Update: 2022-11-05 03:19 GMT

Delhi: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

Delhi: అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది దేశ రాజధాని ఢిల్లీ. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఇవాళ్టి నుంచి సెలవులు ప్రకటించింది. పరిస్థితి మెరగయ్యేవరకు బంద్‌ పెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో 50శాతం మందికి వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేస్తూనే ప్రైవేట్‌ సంస్థలు సైతం ఇందుకు సిద్ధం కావాలని సూచించింది. మార్కెట్ల పనివేళలను కుదించింది.

కాలుష్య నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం. అత్యవసర రవాణా సేవలు, ఎలక్ట్రిక్‌, CNG వాహనాలను తప్పించి అన్నిరకాల ట్రక్‌లను, డీజిల్‌ వాహనాలను నిషేధించింది. నిర్మాణ పనులను నిలిపివేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 431గా నమోదైంది. నోయిడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 529గా రికార్డయింది. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను రంగంలోకి దింపింది ఢిల్లీ సర్కార్. 

Tags:    

Similar News