ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో కన్నుల పండువగా... 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

*ఇద్దరికి పద్మ విభూషణ్, 8 మందికి పద్మభూషణ్ తోపాటు.. మరో54 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి కోవింద్

Update: 2022-03-22 01:18 GMT

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Padma Shri Award 2022: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రకటించిన అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇద్దరికి పద్మవిభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.

భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమార్తెలు క్రితిక, తరణిలు అందుకున్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. యోగా లెజెండ్ స్వామి శివానంద పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య, ఏపీకి చెందిన గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు, అలాగే క‌రోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసిన సీరం అధినేత పూనావాలా కూడా ప‌ద్మశ్రీ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Tags:    

Similar News