ప్రమోద్ సావంత్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ శ్రీధరన్...
Pramod Sawant: కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, పలువురు నాయకులు...
Pramod Sawant: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై.. ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. రెండో సారి సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్‌కు గవర్నర్ శ్రీధరన్, ప్రధాని మోడీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ మంత్రులుగా ఏనిమిది మంది ప్రమాణస్వీకారం చేశారు.