Suraj Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్
Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
Suraj Revanna: కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ మరో కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అవగా.. తాజాగా అతని సోదరుడు సూరజ్ రేవణ్ణను కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. జేడీఎస్ పార్టీ కార్యకర్తను ఫామ్‌హౌస్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని సూరజ్‌పై కేసు నమోదైంది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే హెచ్‌డీ రేవణ్ణ చిన్న కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రజ్వల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే సూరజ్ రేవణ్ణ ఘటన చోటు చేసుకుంది.
జూన్ 16న సూరజ్ తనను ఫామ్‌హౌస్‌కు పిలిచి వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. రూమ్‌లో బంధించి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని సూరజ్ అనుచరుడు శివకుమార్‌కు చెప్పగా.. అతను విషయం బయటకు పొక్కకుండా 2 కోట్లు ఇస్తానని చెప్పినట్టు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాదు తనకు ఉద్యోగం కూడా ఆఫర్ చేశారని పేర్కొన్నాడు. జూన్ 19న డీజీని కలిసిన బాధితుడు సూరజ్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో... హోలె నరసిపుర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.