Karnataka Elections 2023: కర్ణాటకలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న..
Karnataka Elections 2023: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Karnataka Elections 2023: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65. 69 శాతం పోలింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా 2 వేల 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.