Narendra Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు

Narendra Modi: భారత్ శాంతి పక్షనే ఉంటుందని ప్రధాని మోడీ క్లారిటీ

Update: 2022-05-03 02:15 GMT

Narendra Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు 

Narendra Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని ప్రధాని మోడీ అన్నారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తోందని ప్రధాని మోడీ మరోసారి తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత ఏర్పడుతుందన్నారు. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ. ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా రష్యా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రష్యా ఉల్లంఘించిందని జర్మనీ ఛాన్సలర్​ స్కోల్జ్ అభిప్రయాపడ్డారు.

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ రాజధాని బెర్లిన్​లో ఆ దేశ ఛాన్సలర్​ ఒలాఫ్​ స్కోల్జ్​తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాణిజ్యానికి ప్రోత్సాహకాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. 2021 డిసెంబర్‌లో ఛాన్సలర్ స్కోల్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోడీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక భాగస్వామితో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సంబంధాలు మరింత పెరుగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అనంతరం ప్రవాస భారతీయలతో ప్రధాని మోడీ మీట్ అయ్యారు.

Tags:    

Similar News