Ujjwala 2.0: గ్యాస్ సిలిండర్ లేని వారికి మోడీ సర్కార్ శుభవార్త.. కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు..

Ujjwala 2.0: కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ఉజ్వల 2.0 ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Update: 2021-08-10 15:20 GMT

Ujjwala 2.0: గ్యాస్ సిలిండర్ లేని వారికి మోడీ సర్కార్ శుభవార్త.. కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు..

Ujjwala 2.0: కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ఉజ్వల 2.0 ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోడీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వేయి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందివ్వడం ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎలాంటి చిరునామా ధృవీకరణ లేకుండానే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది.

సౌభాగ్య యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల పేద కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందించినట్టు ప్రధాని మోడీ తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 2 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చామని, ఇవి పూర్తిగా మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఈసారి గ్యాస్ కనెక్షన్ తో పాటు ఉచితంగా గ్యాస్ బండ కూడా ఉచితంగా అందివ్వనున్నారు.

Tags:    

Similar News