భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..

Narendra Modi: గుజరాత్‌లోని బరూచ్‌లో నిర్వహించిన సభలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావద్వేగానికి గురయ్యారు.

Update: 2022-05-12 13:00 GMT

భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..

Narendra Modi: గుజరాత్‌లోని బరూచ్‌లో నిర్వహించిన సభలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావద్వేగానికి గురయ్యారు. ఓ కుటుంబం చెప్పిన కష్టం విని నోటమాట రాక మూగబోయారు. వెంటనే తేరుకున్న ఆయన ఇతరుల పట్ల నువ్వు చూపుతున్న కరుణే నీ బలం.. అంటూ ఓ బాలికను మెచ్చుకున్నారు. ఆమె చదువుకు అవసరమైన సమయంలో సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమంలో ఆయుబ్‌ పటేల్‌ అనే లబ్ధిదారుడిని ప్రధాని పలకరించారు. తన ముగ్గురు కూతుళ్లు చదువుకుంటున్నారని ప్రధానికి ఆయుబ్‌ వివరించారు. పెద్ద కూతురు ఇప్పుడు 12వ తరగతి చదువుతుదన్నారు. ఆమె భవిష్యత్తులో డాక్టర్‌ కావాలనుకుంటున్నదని ప్రధానికి ఆయుబ్‌ చెప్పారు. అయితే ఎందుకు వైద్య వృత్తిని ఎంచుకున్నావని ఆ బాలికను ప్రధాని ప్రశ్నించారు. తన తండ్రి అనుభవిస్తున్న సమస్యే కారణమంటూ కన్నీటి పర్యంతమైంది. సౌదీలో పని చేస్తున్న సమయంలో ఆయూబ్‌ కంటి చూపు దెబ్బ తిన్నట్టు తెలిపారు. ఆమె మాటలు విన్న ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే మోదీ తేరుకున్నారు. ఆ తరువాత బాలికను మెచ్చుకున్నారు. రంజాన్‌ ఎలా జరుపుకున్నారని అడిగి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News