Narendra Modi: మోడీ యూరప్ టూర్ అజెండా ఏంటి?

Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కామెంట్ చేస్తారా?

Update: 2022-05-01 10:30 GMT

మోడీ యూరప్ టూర్ అజెండా ఏంటి?

Narendra Modi: ఓ పక్క రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కరోనా నుంచి ఇంకా కోలుకోని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాద ఘంటికలు దక్షిణాసియాలో చైనా దూకుడు పొరుగు దేశాల ప్రమాదకర పోకడలు ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ విదేశాల్లో పర్యటిస్తున్నారు. మరి ఆయన టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం ఆయన చేస్తున్న ప్రణాళిక ఏంటి?

ప్రధాని మోడీ విదేశాలకు వెళుతున్నారంటేనే పెద్ద చర్చ ఆయన ఏ పర్యటన చేసినా దాని వెనకో లక్ష్యం ఉంటుంది. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, పెట్టుబడుల ఆహ్వానం, సాంస్కృతిక, రక్షణ, వాణిజ్య రంగాలలో భారత్ కు చేకూర్చబోయే లాభాల ఎజెండాగా ఆయన టూర్ ఫిక్సవుతుది. మే 2న మొదలయ్యే మోడీ యూరప్ టూర్ చాలా బిజీ బిజీగా సాగనుంది. మొత్తం 65 గంటల టూర్ అందులో 25 సమావేశాలు 8 మంది ప్రపంచ దేశాల నేతలతో వరుస భేటీలు ప్రధాని టూర్ హైలైట్స్ ఇవే

ప్రధాని తన భేటీలో ద్వైపాక్షిక సంబంధాలే కాదు. ఏకకాలంలో 8 మంది దేశాధి నేతలతోనూ బేటీ అవుతారు. అంతేకాదు 50 మంది ప్రముఖ వాణిజ్యవేత్తలను కలుసుకుంటారు. ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులను,భారత సంతతికి చెందిన వారిని కలుసుకుంటారు. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నేపధ్యంలో మోడీ జరుపుతున్న ఈ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఉంది.

జర్మనీ, డెన్మార్క్ దేశాలలో ఒక్కోరాత్రి బస చేయనున్న ప్రధాని మిగిలిన రెండు రాత్రులు విమానం ప్రయాణంలోనే ఉంటారు. ఫ్రాన్స్ తో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్న మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రన్ తో జరిపే భేటీ అత్యంత కీలకమైనది. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో ఉక్రెకయిన్ కు ఫ్రాన్స్ మద్దతు పలకడం పై దేశవ్యాప్తంగా అలజడి రేగుతున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలో చాలా టఫ్ ఫైట్ లో మేక్రన్ గెలిచారు.

ఇక బెర్లిన్ లోజర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత -జర్మనీ ప్రభుత్వాల మధ్య ఆరో దశ చర్చలకు ఇద్దరూ అధ్యక్షత వహిస్తారు. గత డిసెంబర్ లో జర్మనీకి ఎన్నికలు పూర్తయి మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ బాధ్యతలు తీసుకున్నాక జరుగుతున్న తొలి భేటీ ఇది. భారత, జర్మనీ దేశాలు దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2021లోనే వేడుకలు జరుపుకున్నాయి. ఇక రెండువేల సంవత్సరంనుంచి ఈ రెండు దేశాలూ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ఈ అంశాలపైనే కాక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో తలెత్తిన పరిణామాలపైనా ఇరువురూ చర్చించనున్నారు.. ఈఎపిసోడ్ లో భారత్ తటస్థ వైఖరిపై మోడీ మరోసారి వివరణ ఇవ్వనున్నారు.

ఇక డెన్మార్క్ లో జరిగే నార్డిక్ దేశాల సదస్సుకు కూడా మోడీ హాజరవుతారు. డెన్మార్క్ ప్రధానితో కోపెన్ హెగన్ లో అధికారిక భేటీలో పాల్గొంటారు. ద్వైపాక్షిక చర్చలతో పాటు పర్యావరణానికి సంబంధించిన గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ భేటీలో కూడా పాల్గొంటారు. డెన్మార్క్ లో వాణిజ్య ప్రతినిధుల ఫోరంలో పాల్గొని భారత్ లో పెట్టుబడులకు అవకాశాలపై వివరిస్తారు. అక్కడి భారతీయులతో ఇంటరాక్ట్ అవుతారు. ఇక నార్డిక్ దేశాల నేతలతో సాగే సమావేశంలో కరోనా తర్వాత ఆర్థిక స్వావలంబన, క్లైమేట్ ఛేంజ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ, రిన్యువబుల్ ఇంధన వనరుల వినియోగం పై చర్చలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా భద్రత స్థితిగతులు, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇండియా నార్డిక్ సమాఖ్య సహకారంపైనా ఈ సదస్సు చర్చిస్తుంది. అయతే మోడీ విదేశీ టూర్లకు బీజేపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఆనవాయితీ.. కానీ ఈసారి మాత్రం మోడీ ఎలాంటి హంగామా హడావుడి లేకుండానే ఈ పర్యటనలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించడం, రష్యాతో వాణిజ్య బంధాలు కొనసాగింపుపై మోడీ ఇచ్చే వివరణకు ప్రాధాన్యత ఉండబోతోంది.

Tags:    

Similar News