PM Modi: యూపీ అభివృద్ధికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిదర్శనం
PM Modi: గత ప్రభుత్వాలు తూర్పు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి: మోడీ
PM Modi: రాష్ట్ర అభివృద్ధికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తర ప్రదేశ్, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపై ఎవరికైనా సందేహాలుంటే, సుల్తాన్‌పూర్ వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. మూడు, నాలుగేళ్ళ క్రితం ఓ సాధారణ భూమి ఉన్న చోట ఇప్పుడు అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వే వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోని తూర్పు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్న మోడీ దేశ భద్రత గురించి పట్టించుకోనివారికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఎయిర్‌స్ట్రిప్ గట్టి సందేశం పంపుతుందని పేర్కొన్నారు.