UP: యూపీ బీజేపీలో చీలికలు? సమూల మార్పులకు కమలం సిద్ధం

UP: లోకసభ ఎన్నికల్లో వైఫల్యంతో యూపీ బీజేపీ చెలరేగిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓటమిపై ఈమధ్యే పార్టీ నేతలు భిన్న వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు నెలకున్న పరిస్థితి తెలిసిందే. యూపీలో నాయకత్వ బాధ్యతలు ఓబీసీకి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోదీతో యూపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-07-18 01:07 GMT

UP: యూపీ బీజేపీలో చీలికలు? సమూల మార్పులకు కమలం సిద్ధం

UP:  యూపీ బీజేపీలో లుకలుకలు ఆ పార్టీ నేతలను కలవరం పెడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ రచ్చ మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సమయంలో పార్టీ అధినాయకత్వం రాష్ట్ర శాఖలో సమూల మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. అందుకే యూపీకి చెందిన నాయకులతో ఒక్కొరిక్కరితో అధిష్టానం సమావేశం అవుతోంది. దానికి కొనసాగింపుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో డిప్యూటీ సీఎంకేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీలో ఒంటరిగా భేటీ అయ్యారు. లోకసభ ఎన్నికల ఫలితాల వైఫల్యంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలపై వారు చర్చించనున్నట్లు సమాచారం. యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌధరి కూడా నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది.

పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు క్రుషిచేయాలని ఆయనకు నడ్డా సూచించినట్లు తెలిసింది. మరోవైపు సర్కార్ కంటే పార్టీయే గొప్పని కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. పార్టీ అనేది ప్రభుత్వం కంటే గొప్పది కాదు. కార్యకర్తల బాధే నా బాధ. ఏ ఒక్కరూ కూడా పార్టీ కంటే పెద్దవారు కాదు. కార్యకర్తలు పార్టీ ఎంతో గర్వకారణం. నా ఇంటి తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయి. నేను డిప్యూటీ సీఎం కావడం తర్వాత విషయం. అంతకంటే ముందు నేను పార్టీ కార్యకర్తను. కార్యకర్తలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గౌరవించాలని ట్విట్టర్ లో బుధవారం మౌర్య పోస్టు పెట్టారు. లోకసభ ఎన్నికల తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మౌర్యకు మధ్య విభేదాలు తెలెత్తినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక యోగి సర్కార్ ఇంటిపోరు కొనసాగుతుందన్న ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు బీజేపీ అధినాయకత్వం యూపీ యూనిట్లో సమూల మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పది కాదని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. కాగా యోగి సర్కార్ లో అంతర్గతపోరు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు తెలుసన్నారు. కుర్చీలాటతో వారు విసిగిపోయారంటూ దుయ్యబట్టారు. అఖిలేష్ వ్యాఖ్యలను కేశవ ప్రసాద్ మౌర్య తిప్పికొట్టారు.

Tags:    

Similar News