TATA Aircraft Complex: C-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ

TATA Aircraft Complex: గుజరాత్‌లోని వడోదరలోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ క్యాంపస్‌లో సి-295 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత్, స్పెయిన్ ప్రధానులు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

Update: 2024-10-28 06:35 GMT

TATA Aircraft Complex: గుజరాత్‌లోని వడోదరలోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ క్యాంపస్‌లో సి-295 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రారంభించారు. టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీన్ని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయడం కూడా ఇదే తొలిసారి. స్పెయిన్ లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్ కు చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు.

ఈ ప్లాంట్ మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ ను బలోపేతం చేస్తుందన్నారు. భారత్-స్పెయిన్ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్ తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళ్తున్నామని మోదీ వెల్లడించారు. ఈమధ్యే భారత్ రతన్ టాటాను కోల్పోయింది. ఆయన జీవించి ఉంటే నేడు ఇక్కడ మన మధ్య ఉండేవారు. ఎక్కడున్నా ఆయన దీనిని చూసి సంతోషిస్తారు అని మోదీ నివాళులర్పించారు.



స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మాట్లాడారు. ఎయిర్ బస్, టాటాల భాగస్వామ్యం భారత వైమానిక రంగం పురోగతికి బాటలు వేస్తుందని అన్నారు. ఇతర ఐరోపా దేశాలు భారత్ కు వచ్చేందుకు ఇది ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News