Assam: తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం: ప్రధాని మోదీ
Assam: అసోంలో శాంతి, అభివృద్ధి సుస్థిరంగా కొనసాగాలంటే బీజేపీ కూటమికి ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
Assam: అసోంలో శాంతి, అభివృద్ధి సుస్థిరంగా కొనసాగాలంటే బీజేపీ కూటమికి ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు అసోం గుర్తింపునే ధ్వంసం చేశాయని మండిపడ్డారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని మోడీ అసోం ప్రచారంలో చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల జీవితాలు.., ముఖ్యంగా మహిళల జీవితాలు సౌకర్యవంతం కావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న నినాదంతో ఐదేళ్లూ పనిచేశామని మోడీ తెలిపారు.
అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన రోజు ఓ ఈవీఎంను... ప్రైవేటు కారులో తరలించిన సంఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గువహాటిలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్ మాట్లాడుతూ...బీజేపీ అభ్యర్థులందరూ అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తమవైపే ఉండటంతో వారు భయపడుతున్నారని ఎద్దేశా చేశారు కాంగ్రెస్ నేత. ఈవీఎం తీసుకెళ్లిన బీజేపీ అభ్యర్థి వాహనంపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారాయన.