PM Modi on New National Education Policy: 21వ శతాబ్దానికి అనుగుణంగా నూత‌న విద్యావిధానం: ప్రధాని మోడీ

PM Modi on New National Education Policy: పుస్త‌కాల బ‌రువుల‌కు చెక్ ప‌డింది. బ‌ట్టి చ‌దువుల‌కు స్వ‌స్తి చెప్పింది. నైపుణ్యాల పెంచే చ‌దువుల‌పై కేంద్రం దృష్టి సారించింది.

Update: 2020-08-07 09:27 GMT

PM Modi on New National Education Policy: పుస్త‌కాల బ‌రువుల‌కు చెక్ ప‌డింది. బ‌ట్టి చ‌దువుల‌కు స్వ‌స్తి చెప్పింది. నైపుణ్యాల పెంచే చ‌దువుల‌పై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే దేశ‌వ్యాప్తంగా విద్యావిధానాన్ని మార్చేసింది. నూత‌న విద్యావిధానాన్ని అమ‌లు చేసింది. దేశ‌వ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని, ఈ నూతన విద్యా విద్యా విధానంతో విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోతాయని ప్రధాని మోడీ అన్నారు.

శుక్రవారం ప్ర‌ధాని జాతీయ విద్యా విధానం పై ప్రసంగిస్తూ ఈ నూత‌న విద్యావిధానం 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తెచ్చామని, విద్యా విధానంపై ఎలాంటి ఆందోళన వద్దని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని రూపొందించడానికి తాము ఆరేళ్ల పాటు శ్రమించామని అన్నారు. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ సాగిందని, చెప్పారు. వాటిని మధించిన తరువాతే తాము నూతన విద్యావిధానాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.

రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. కొత్త విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, ఇదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని చెప్పారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుందని చెప్పారు.

30 ఏండ్ల త‌రువాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.   

Tags:    

Similar News