PM Kisan 18th Installment: రైతులకు మోదీ సర్కార్ కానుక. పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆ రోజే

PM Kisan 18th Installment: పీఎం కిసాన్ 18వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ మనీ త్వరగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డేట్ ఫిక్స్ అయ్యింది. పీఎం డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం.

Update: 2024-09-26 05:58 GMT

PM Kisan 18th Installment: రైతులకు మోదీ సర్కార్ కానుక. పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆ రోజే

PM Kisan 18th Installment: పీఎం కిసాన్ 18వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ మనీ త్వరగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డేట్ ఫిక్స్ అయ్యింది. పీఎం డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతీ రైతుకు రూ. 6000ఇస్తుంది. ఈ డబ్బును ఒకేసారి కాకుండా మూడు విడతల్లో లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో వేస్తోంది. తద్వారా రైతులు ఈ డబ్బు తీసుకుని..విత్తనాలు, పురుగు మందులు కొనుక్కొని పంటలు వేసుకునేందుకు వీలవుతుంది. 18వ విడత డబ్బు రావాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్ 18వ విడతలో రూతులకు రూ. 2వేలు రావాల్సి ఉంటుంది. ఆ డబ్బు ఎప్పుడు వస్తుందనేది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జులై నుంచి ఈ డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలలకోసారి డబ్బు కేంద్రం ఖాతాల్లో జమ చేస్తుంది కాబట్టి 17వ విడత తర్వాత నాలుగు నెలల వరకు గ్యాప్ తీసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో 18వ విడత ఇన్ స్టాల్ మెంట్ డేట్ ను ఫిక్స్ చేసింది.

పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బును అక్టోబర్ 5న కేంద్రం రిలీజ్ చేయనుంది. ప్రధాని మోదీ స్వయంగా రైతుల అకౌంట్లోకి రెండు వేలు వెళ్లేలా చేస్తారు. వెంటనే ఈ డబ్బు అకౌంట్లోకి వచ్చేస్తుంది. కొన్ని గంటల్లోనే మొబైల్లకు మెసేజ్ లు వస్తున్నాయి. దాంతో రైతులు ఆ డబ్బుతో వెంటనే అవసరమైనవి కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ డబ్బులు అక్టోబర్ చివరిలో ఖాతాల్లో జమ అవుతాయన్న ప్రచారం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ లో పంటలు వేస్తున్నారు. అదీకాకుండా అక్టోబర్ లో దసరా పండగ వస్తోంది. ఆ తర్వాత దీపావళి ఉంటుంది. అందువల్ల కేంద్రం ముందుగానే మనీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రైతులు, పండగలను బాగా జరుపుకునేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది.

రైతులు ఈ మనీ పొందాలంటే తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలి. ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఒకవేళ కేవైసీలో సమస్య ఉంటే, రైతులు ముందుగానే వెళ్లి, బ్యాంకులో చెక్ చేయించుకోవాలి. లేదంటే డబ్బు ఖాతాల్లో జమ కాదు. 

Tags:    

Similar News