Petrol Price: పెట్రోల్, డీజిల్ పై 35 పైసలు పెంపు

Petrol Price: దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 38పైసల వరకు పెంచాయి.

Update: 2021-02-23 06:42 GMT

ఇమేజ్ source: గూగుల్


ఆది, సోమవారాల్లో కాస్త ఉపశమనం ఇచ్చిన చమురు కంపెనీలు మంగళవారం ధరలను పెంచాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 38పైసల వరకు పెంచాయి. ఇప్పటి వరకు ఈ నెలలో పెట్రోల్‌ ధరలు 15 సార్లు పెరిగాయి.దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చర్చనీయాంశమైన వేళ దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.93గా, డీజిల్‌ ధర రూ.81.32గా నమోదైంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.54, డీజిల్‌ ధర రూ.88.69గా నమోదైంది.

కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్పందిస్తూ..'పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు అధిక లాభాల కోసం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఆ కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి' అని చెప్పుకొచ్చారు. కాగా గత 54రోజుల్లో చమురు ధరలు 25సార్లు పెరగడం గమనార్హం.

ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.97.34కు చేరగా.. డీజిల్‌ రూ.88.44, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.31, కోల్‌కతాలో పెట్రోల్ లీటర్‌కు రూ.91.12, డీజిల్‌ రూ.84.20కు చేరింది. ఆదివారం ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రూ.1 తగ్గించింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ.94.54, డీజిల్‌ రూ.88.69కు పెరిగింది. భోపాల్‌లో పెట్రోల్‌ రూ.98.96, డీజిల్‌ రూ.88.60, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.47, డీజిల్‌ రూ.89.82కు చేరాయి. 

Tags:    

Similar News