NEET-UG Exam: నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్

NEET-UG Exam: పరీక్షను క్యాన్సిల్ చేయడం సులువు కాదన్న ధర్మాసనం

Update: 2024-06-11 13:55 GMT

NEET-UG Exam: నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్

NEET-UG Exam: నీట్‌ పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటాయని పేర్కొంది. పరీక్షపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News