Good News:గుడ్‌న్యూస్.. ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్‌ విత్‌డ్రా..!

Good News:గుడ్‌న్యూస్.. ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్‌ విత్‌డ్రా..!

Update: 2022-06-12 13:30 GMT

Good News:గుడ్‌న్యూస్.. ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్‌ విత్‌డ్రా..!

Good News: సామాన్యులకి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. మనం డబ్బులు అవసరమైనప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్లి ఎలా విత్‌ డ్రా చేసుకుంటామో ఇప్పుడు రేషన్‌ సరుకులు కూడా అలాగే తీసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ గ్రెయిన్ ఏటీఎం యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఎటీఎం కార్డు మాదిరే రేషన్‌కి కూడా ఓ ప్రత్యేక కార్డు ఇస్తారు. దీనివల్ల లైన్లలో గంటలు తరబడి నిలుచోవాల్సిన అవసరం కూడా ఉండదు.

ఉత్తరాఖండ్ ఆహార శాఖ త్వరలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. అక్కడి ఆహార మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు తమ అవసరాల కోసం ATM మెషీన్ల నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేస్తారో ఇప్పుడు అదే తరహాలో ఆహార ధాన్యాలు విత్‌ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. వరల్డ్ ఫుడ్ స్కీమ్ అనే ప్రత్యేక పథకం కింద రాష్ట్రంలో ఫుడ్ గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ ఆహార ప్రణాళిక కింద దీనికి సంబంధించి ఆమోదం కూడా లభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆహార ధాన్యాల ATM పథకం ఒరిస్సా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతోంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ దేశంలో మూడవ రాష్ట్రంగా అవతరించనుంది. ఇది కూడా ATM మెషిన్ వంటి స్క్రీన్ కలిగి ఉంటుంది. రేషన్‌కార్డుదారులు ఇక్కడికి వచ్చి ఏటీఎం మెషీన్‌లో గోధుమలు, బియ్యం, పప్పులు విత్‌డ్రా చేసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అర్హులైన వ్యక్తుల ఏటీఎం కార్డులాగే రేషన్ కోసం కూడా ఏటీఎంను తయారు చేస్తారు. దీని సహాయంతో ఒక వ్యక్తి తన రేషన్‌ను ఎక్కడి నుండైనా తీసుకోగలుగుతాడు. ఈ పథకం విజయవంతమైతే అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News