Hackers: దేశంలో విరుచుకపడ్డ హ్యాకర్స్ దొంగలు
Hackers: కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్ * జర్నలిస్టులు, జడ్జీలు, వ్యాపారులను వదలని హ్యాకర్స్
Hackers: దేశంలో మళ్లీ హ్యాకర్స్ దొంగలు ఎగబడ్డారు. ఈసారి ఏకంగా పెద్దల ఫోన్లను టచ్ చేశారు. కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల డేటాను చోరీ చేశారు. అఖరికి జర్నలిస్టులు, జడ్జీలు, బడా వ్యాపారుల ఫోన్లను కూడా వదిలిపెట్టలేదు. తాజాగా లీకైన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఇజ్రాయోల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్ కంపెనీకి చెందిన పెగాసస్ అనే స్పైవేర్ సాయంతోనే ఈ తంతూ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ స్పైవేర్ ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంటుంది. దీంతో తాజా హ్యాకింగ్ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని కేంద్రం చెబుతోంది. దేశ పౌరుల గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హ్యాకింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది.
కాగా, హ్యాకింగ్ గురించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ ట్వీట్ చేశారు. పోస్ట్ చేసినా కొద్ది గంటల తర్వాత విషయం బయటకు రావడంతో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్‌కు గురైనట్లు విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఒకవేళ అదే నిజమైతే ఆ లిస్ట్‌ను తాను విడుదల చేస్తానని ట్వీట్ లో స్వామి వెల్లడించారు.