Mumbai: ముంబై నుంచి సొంతూళ్ళ బాట పట్టిన వలస కార్మికులు
Mumbai: పేద ప్రజల్ని కరోనా మళ్ళీ కష్టాల పాల్జేస్తోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో అమలవుతున్న జనతా కర్ఫ్యూ రోజువారీ కార్మికుల జీవితాలను అల్ల కల్లోలం చేస్తోంది.
Mumbai: పేద ప్రజల్ని కరోనా మళ్ళీ కష్టాల పాల్జేస్తోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో అమలవుతున్న జనతా కర్ఫ్యూ రోజువారీ కార్మికుల జీవితాలను అల్ల కల్లోలం చేస్తోంది. మహారాష్ట్రంలో రెండు వారాల పాటు మహాజనతా కర్ఫ్యూ విధించడంతో వలస కార్మికులు సొంత ఊళ్ళబాట పట్టారు. డిమాండ్ పెరగడంతో ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలోని ముఖ్య నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే సమయంలో టిక్కట్ల ధరలను కూడా పెంచుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలతో రద్దీగా మారిపోయింది.