Twitter: ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం.. ట్విట్టర్‌కు పార్లమెంట్ ప్యానెల్ సమాన్లు
Twitter: ట్విట్టర్‌పై కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Twitter: ట్విట్టర్‌పై కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ఐటీ రూల్స్‌ని పాటించాలని గతంలో ట్విట్టర్‌ను మందలించింది. ఐనా ట్విట్టర్ పట్టించుకోకపోవడంతో పార్లమెంటరీ ప్యానెల్ సమాన్లు జారీ చేసింది. శుక్రవారం పార్టమెంటరీ ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కొత్త రూల్స్‌ని పాటించాలని స్పష్టం చేసింది.
కొత్త ఐటీ నిబంధనలు, ఇతర సమస్యలపై చర్చ జరపాలని నోటీసుల్లో పేర్కొంది. సోషల్ మీడియా గ్రూపులతో చర్చల కొనసాగింపు అవుతుంది. ఐటి రెగ్యులేషన్ నిబంధనలు, ఇటీవలి కొన్ని పరిణామాలపై ట్విట్టర్ భారత అధికారులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం అన్ని నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు తుది నోటీసు ఇచ్చింది.