పప్పూయాదవ్ కే వార్నింగా?

Pappu Yadav: సల్మాన్ ఖాన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-10-28 12:45 GMT

Pappu Yadav: సల్మాన్ ఖాన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఆయనకు ఓ ఆడియో క్లిప్ అందింది. యాదవ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గంటకు లక్ష రూపాయాలు చెల్లించి జైలు సిగ్నల్ జామర్లను నిలిపివేసి పప్పూ యాదవ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మీరు బాయ్ తో సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలని కోరారు.

మిమ్మల్ని పెద్దన్నగా భావించా.. కానీ, మీరు ఇబ్బంది పెట్టారు. మళ్లీ ఫోన్ చేస్తే భాయ్ తో కనెక్ట్ చేస్తానని ఆ ఆడియో సంభాషణలో ఉందని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మాజీ మంత్రి ఎన్ సీ పీ నాయకులు బాబా సిద్దిఖీ హత్య తర్వాత పప్పూ యాదవ్ స్పందించారు. తనకు అనుమతిస్తే 24 గంటల్లో లారెన్స్ గ్యాంగ్ నెట్ వర్క్ ను నిర్వీర్యం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు. పప్పూ యాదవ్ వ్యాఖ్యల తర్వాత ఆయనకు ఈ ఆడియో క్లిప్ అందింది.

ఈ నెల 12న మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు హత్య చేశారు. సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైనందునే అతడిని చంపామని ఆ గ్యాంగ్ సభ్యులు ప్రకటించారు. ఈ కేసులో తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిఖీ హత్య ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.

Tags:    

Similar News