30 గంటలకు పైగా నీటిలో యోగా చేస్తా : రాజేశ్వర్ శాస్త్రి
కనిపిస్తున్న ఫోటో ఛత్తీస్‌గడ్ లోని బిలాస్‌పూర్‌కు చెందినది.
కనిపిస్తున్న ఫోటో ఛత్తీస్‌గడ్ లోని బిలాస్‌పూర్‌కు చెందినది. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిబాద్రి కేదార్‌నాథ్ ఆలయానికి చెందిన పండిట్ రాజేశ్వర్ శాస్త్రి నీటిలో యోగా చేశారు. ఆయన గత 20 సంవత్సరాలు నీటిలో యోగా కార్యకలాపాలు చేస్తూవస్తున్నారు. అంతేకాదు ఈ విద్యను చాలా మందికి సైతం నేర్పించారు.. అయితే అందరికి అంత ఈజీగా రాలేదు. ప్రతిసారి 'యోగా డే' కు తన శిస్యులతో కలిసి ఆసనాలు వేసేవారు.
అయితే ఈసారి కోవిడ్ -19 కారణంగా, ఆయన మాత్రమే సోమ్ నది ప్రవాహంలో యోగా కార్యకలాపాలు చేశారు. దాదాపు ఒక గంటపాటు ఇలా నీటిలో ఆసనం వేశారు. ముఖ్యంగా యోగాలో పద్మాసన, షయా ఆసనం, ధేను ఆసనం వంటి అనేక యోగా కార్యకలాపాలు చేయడం ద్వారా జీవితాన్ని పునరుద్ధరించవచ్చని ఆయన అంటారు. ఒక్కోసారి రాజేశ్వర్ శాస్త్రి 30 గంటలకు పైగా నీటిలో యోగా చేస్తానని చెబుతుంటారు.