Fancy Number: స్కూటీకి లక్ష.. రిజిస్ట్రేషన్‌కు కోటి 11వేల రూపాయలు..!
Fancy Number: చాలామందికి ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఉంటుంది.
Fancy Number: చాలామందికి ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఉంటుంది. కొంతమంది జాతకరీత్యా కావలసిన నెంబర్ కోసం ప్రయత్నిస్తారు. కొంతమందికి నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో కావలసిన నెంబర్ కోసం చాల మంది ప్రయత్నిస్తారు. రవాణా శాఖ ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్లను వేలంపాటలో ఉంచుతుంది. ప్రతి సిరీస్ లోనూ ఇలా ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో ఉంచుతారు. వాటికోసం చాలా మంది పోటీ పడి సొమ్ము వెచ్చిస్తారు.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రవాణా శాఖ HP999999ను వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది. దానికోసం ఇప్పటివరకు 26 మంది బిడ్‌లు దాఖలు చేశారు. వారిలో కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.1,00,11,000కు బిడ్ వేశాడు. అంత భారీ మొత్తం పెట్టి ఫ్యాన్సీ నంబరును పొందేందుకు ప్రయత్నిస్తున్నాడంటే.. దాన్ని అమర్చబోయేది ఏ లగ్జరీ కారుకో అనుకుంటే పొరపాటే. తాను రూ.లక్ష పెట్టి కొనుగోలు చేసిన స్కూటీ కోసం.