కేరళ ఏనుగు మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు..

గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి.

Update: 2020-06-06 11:50 GMT

గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి. అటవీ శాఖ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఏనుగు చనిపోక ముందు తిన్నది పైనాపిల్ కాదని, ఫైర్ క్రాకర్స్‌తో నిండిన కొబ్బరిబోండాంను తిన్నదని మన్నార్‌కడ్ డివిజనల్ అటవీశాఖ అధికారి తెలిపారు.నిందితుడు అక్కడున్న ఓ ఎస్టేట్‌లో పనిచేస్తాడు. పంటను పాడు చేయకుండా అండవి పందులు, ఇతర జంతువులు ఉండేందుకు వాటిని చంపేందుకు ఇలా కొబ్బరిబోండాల్లో పేలుడు పదార్థాలు నింపి అక్కడ పెడతారు.

కాగా.. ఈ కేసులో నిందితుడు అక్కడున్న ఓ ఎస్టేట్‌లో పనిచేస్తాడు. అతడిని అరెస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు ఘటన స్థలానికి తీసుకుని వెళ్లారు. అతడితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్టు తెలిసింది. నిందితుడి పేరు విల్సన్ అని, అతడికి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనపై యావత్తు దేశం స్పందించింది. పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి గజరాజును చంపిన ఘటన చాలా మందిని కలవరానికి గురిచేసింది. మూగజీవాన్ని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేరళలోని మల్లపురంలో ఆకలితో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు కలిపిన పండును ఆహారంగా పెట్టారు కొందరు ఆకతాయిలు. నోట్లో పెట్టుకోగానే పండు పేలిపోవటంతో ఆ ఏనుగు నోటికి తీవ్ర గాయమైంది. బాధను తట్టుకోలేక నదిలో ఉండిపోయిన ఆ ఏనుగు చివరకు ప్రాణాలు విడిచింది.

తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన కేరళ ఏనుగు మృతిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.ఏనుగు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నిందితులను పట్టి ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని కొందరు ప్రకటిస్తున్నారు.

ఏనుగు మృతి చెందిన ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగు మృతి చెందడం తమని తీవ్రంగా కలిచివేసిందని ట్విట్ చేశారు. ఓ ఏనుగు పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడానికి వారికి మనసెలా వచ్చిందని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News