కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్..!
Nitin Gadkari: కేంద్రమంత్రిని చంపేస్తామని నాగ్‌పూర్ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని కార్యాలయంలో ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామని బెదిరించారు. దీంతో నితిన్ గడ్కరీ కార్యాలయం సిబ్బంది నాగర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గంటలకు, మధ్యాహ్నం 12. 32 గంటలకు ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. గడ్కరీ ప్రస్తుతం నాగపూర్ లోనే ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. గడ్కరీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.