New Covid Guidelines: కరోనా ఉన్నా, లేకున్నా ఈ రూల్స్ పాటించండి: కేంద్రం

New Covid Guidelines: కరోనా సెకండ్ వేవ్ తో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Update: 2021-05-06 15:57 GMT

New Covid Guidelines: కరోనా సెకండ్ వేవ్ తో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఈ రూల్స్ పాటించాలని సూచించింది. ఇంటికే పరిమితం కావాలని, బీపీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ల సలహాలు పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని కోరింది. అలాగే కోవిడ్ ఉన్నవారు 3 పొరల మాస్క్ ధరించాలని పేర్కొంది.

వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని సూచించింది. ఆక్సిజన్‌ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలంది. ఐసోలేషన్‌ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని పేర్కొంది. చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని పేర్కొంది.

Tags:    

Similar News