అమర వీరుడి భార్య కన్నీళ్లపైనా అసభ్య కామెంట్లు.. కఠిన చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్..

Kirt Chakra: దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమన్‌ సింగ్‌ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది.

Update: 2024-07-09 12:00 GMT

అమర వీరుడి భార్య కన్నీళ్లపైనా అసభ్య కామెంట్లు.. కఠిన చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్..

Kirt Chakra: దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమన్‌ సింగ్‌ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఇటీవల ఆయన భార్య స్మృతి రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో యావత్‌ భారత దేశం అమరవీరుడి కుటుంబాన్ని కీర్తించింది. అవార్డు స్వీకరించే సమయంలో అమర వీరుడి భార్య పెట్టుకున్న కన్నీళ్లకు దేశప్రజల కళ్లూ చెమర్చాయి.

కాగా ఆ వీడియోపైనా కొందరు అసభ్యకర కామెంట్లు పెట్టడంతో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తి అసభ్యకరంగా చేసిన కామెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్‌ ఆ యువకుడి చర్యను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసులు తక్షణమే అతడిని అరెస్టు చేయాలని ఘటనపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.


Tags:    

Similar News