ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

* భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం

Update: 2022-07-06 03:22 GMT

ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Mumbai: భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై తల్లడిల్లుతోంది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు. పలు చోట్ల ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 70 శాతానికి పైగా ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వర్షాల తాకిడికి పలు రైళ్లను నిలిపివేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో NDRF దళాలు అప్రమత్తంగా ఉండాలని మాహారాష్ట్ర సర్కార్ ఆదేశించింది.

మరోవైపు లోతట్టు ప్రాంతాల లోకి భారీగా నీళ్లు చేరుతుండడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 3వేల 500 మందిని తరలించి వారికి భద్రత కల్పించారు. ఇక ముందుస్తు హెచ్చరికల నేపథ్యంలో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా పలు చోట్లు వర్షాల దెబ్బకు చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను ఏర్పాటు చేసింది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు.

Tags:    

Similar News