ఇవాళ దేశంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్
*కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై స్పెషల్ డ్రైవ్
Covid Mock Drill: వివిధ దేశాల్లో కోవిడ్ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం సూచనల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్యసిబ్బంది అందుబాటు, తదితర అంశాలను అధికారులు మాక్ డ్రిల్‌లో పరిశీలిస్తారు. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే సరిదిద్ది, పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు. కర్ణాటక ప్రభుత్వం కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాల్ డ్రిల్‌లో ఐసీయూ పడకలు, వెంటిలేటర్ పడకల లభ్యతకు అధిక ప్రాధ్యాన్యం ఇవ్వనున్నారు.