Heavy Rains: తమిళనాడులో వరుణుడి బీభత్సం
*తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ *పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Heavy Rains: తమిళనాడులో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పాఠశాలలు మూసివేసింది. ఇవాల తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా అటు కర్ణాటక, పుదుచ్చేరిలోనూ స్కూళ్లు మూసివేశారు.
నీలగిరి, సాలెమ్, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూర్, వెళ్లూర్, కడలూరు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
మరోవైపు భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు 1నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మూసివేయాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు వర్షప్రభావాన్ని సమీక్షించాలని స్థానిక అధికారులకు సూచనలు చేసింది.