Narendra Modi: పదేళ్లలో డాక్టర్లే.. డాక్టర్లన్న మోడీ
Narendra Modi: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ జనాలకు హితవు
Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఆయా దేశాల పౌరులే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అన్ని దేశాల్లో కంటే ఉక్రెయిన్‌లో మెడికల్ కోర్సుకు ఫీజు తక్కువ. దీంతో ఇండియాతో పాటు ఇతర దేశాల విద్యార్థులు కూడా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తారు. అయితే వార్ దెబ్బతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పుడప్పుడే జెలెన్ స్కీ సామ్రాజ్యం కోలుకునేలా కనపడటం లేదు. ఇదిలా ఉంటే వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎలాగోలాగ స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఉక్రెయిన్ నుంచి ఉన్నట్టుండి భారత్‌కు వచ్చేయడంతో ఆ విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు అంధకారంలో చిక్కుకుంది. తమ చదువుల కొనసాగింపుపై గందరగోళంలో పడ్డారు ఇండియన్ స్టూడెంట్స్.
స్వాతంత్ర్యం సాధించి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో నేటికి వైద్య విద్య అందుబాటులో లేకపోవడం ఇప్పుడు భారతీయ విద్యార్థుల పట్ల శాపంగా మారింది. అరకొరగా ఉన్న మెడికల్ కాలేజీల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుండటంతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు స్టూడెంట్స్. అయితే ఉక్రెయిన్ దెబ్బతో లక్షలాది మంది వైద్య విద్యార్థులు వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు వారి పరిస్థితేంటన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కోవిడ్ దెబ్బతో భారత్‌లో ఉన్న వైద్య సదుపాయాలు ఏంటనేది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. కరోనా వేళ లక్షల ఫీజుతో మిడిల్ క్లాస్ వాళ్లకు కష్టాలు తప్పలేదు. ఈ సమస్యలను అధిగమించాలంటే భారత్‌లో వైద్యరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే ముందు వైద్య విద్య చౌకగా ఉండాల్సి ఉంది.
అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇండియా కాస్త దూకుడు పెంచింది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులతో పాటు పేదవాళ్లకు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. దేశంలో వైద్య విద్యతో పాటు వైద్య సేవలను బలపరుస్తామన్నారు మోడీ. అందుకోసం జిల్లాకో మెడికల్ కాలేజీ కేటాయిస్తామని చెప్పారు. ఇక ఫీజులతో పాటు మందుల ధరలను కూడా భారీగా తగ్గిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లలో డాక్టర్లే డాక్టర్లంటూ వ్యాఖ్యానించిన ప్రధాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ జనాలకు హితవు పలికారు. పరిశుభ్రతతో చాలా మేలన్న మోడీ రోజూ నడవాలని, ఎక్సర్‌సైజ్‌లు చేయాలంటూ పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాకో మెడికల్ ఏర్పాటుకు పదేళ్లు పడుతుండా మోడీ సార్ అంటూ ప్రతిపక్షాలు ప్రధానిపై సెటైర్లు వేస్తున్నాయి.