మళ్లీ బీజేపీకి దగ్గరగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు

మణిపూర్ లో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి రాజీనామా చేసిన నలుగురు మంత్రులు మళ్లీ తిరిగి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్నీ ఎన్పీపీ అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గురువారం తెలిపారు.

Update: 2020-06-25 13:44 GMT

మణిపూర్ లో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి రాజీనామా చేసిన నలుగురు మంత్రులు మళ్లీ తిరిగి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్నీ ఎన్పీపీ అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గురువారం తెలిపారు. అంతేకాదు బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వారు చెప్పినట్లు వెల్లడించారు. కాగా దీనిపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఎన్పీపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఈ విషయం బుధవారం రాత్రి మాకు తెలిసింది అని అన్నారు. కానీ ఇప్పుడు వారు మళ్ళీ ప్రభుత్వానికి టచ్ లోకి రావడం విశేషం అన్నారు. దీంతో మణిపూర్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడినట్లయింది. బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం తప్పిందని పరిశీలకులు అంటున్నారు. కాగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్పీపీ, టీఎంసీ, ఇండిపెడెంట్ సహా కాంగ్రెస్ నుంచి బీజీపీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రకటించడంతో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసింది. 


Tags:    

Similar News