Manipur: హింస నుంచి తేరుకుంటున్న మణిపూర్‌.. కర్ఫ్యూని సడలించిన అధికారులు

Manipur: హింసాత్మక ఘటనలపై అధికారిక ప్రకటన విడుదల చేసిన సర్కార్

Update: 2023-05-09 07:31 GMT

Manipur: హింస నుంచి తేరుకుంటున్న మణిపూర్‌.. కర్ఫ్యూని సడలించిన అధికారులు  

Manipur: హింసతో అట్టుడికిన మణిపూర్‌లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యావ సరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇళ్లను వీడి బయటకు వస్తున్నారు. కొన్ని గంటల పాటు కర్ఫ్యూ సడలించామని అధికారులు తెలిపారు. డ్రోన్‌లు, హెలికాప్టర్లులతో ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించాయి. ఇప్పటివరకు 23వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో సర్వం కోల్పోయిన అనేక మంది గిరిజనులు ఇంఫాల్‌, చురచంద్‌పూర్‌లలో బిక్కుబిక్కుమంటున్నారు. కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక షెల్టర్లలో ఇంకా భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు.

మణిపూర్ హింసలో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 231 మంది గాయపడ్డారని, మతపరమైన ప్రదేశాలతో సహా 17 వందల ఇళ్లు దగ్ధమయ్యాయని తెలిపింది.మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది.

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. చురచంద్‌పూర్ జిల్లాలో సహాయ శిబిరాల్లో చిక్కుకున్న సుమారు 5 వందల మందిని భారీ భద్రత మధ్య నిన్న సాయంత్రం ఇంఫాల్ తరలించారు.  

Tags:    

Similar News