Mamata Banerjee: జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్న మమత

Mamata Banerjee: తృణమూల్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా దీదీ * వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్న బెంగాల్‌ సీఎం

Update: 2021-07-24 04:27 GMT

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఇమేజ్)

Mamata Banerjee: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్‌ వెల్లడించారు. చాలా కాలంగా టీఎంసీ పార్లమెంటరీ పార్టీ వెనుక ఉండి ఆమె మార్గదర్శనం చేస్తూ ఉన్నారన్నారు. ఆ వాస్తవికతనే అధికారికంగా ప్రకటిస్తున్నామని, తమ ఛైర్‌పర్సన్‌ ఏడు సార్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా కూడా ఉన్నారని ఓబ్రెయెన్‌ గుర్తు చేశారు. పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉన్నందునే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఆమె జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారంటూ వార్తలు వస్తున్న వేళ ఈ కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారంలో ఆమె ఢిల్లీ పర్యటనలో అనేకమంది విపక్ష పార్టీల నేతలు దీదీతో సమావేశం కావాలనుకుంటున్నారని కూడా డెరెక్‌ తెలిపారు.

Tags:    

Similar News