ప్రధాని మోదీకి కేసీఆర్‌ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే?

Narendra Modi: లేఖ రాసిన కేసీఆర్ సహా 9 మంది విపక్ష నేతలు

Update: 2023-03-05 06:00 GMT

ప్రధాని మోదీకి కేసీఆర్‌ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే? 

Narendra Modi: ప్రధాని మోడీకి విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ సీఎం కేసీఆర్‌తో పాటు 9విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. సిసోడియా అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇండియా ఇంకా ప్రజాస్వామ్యదేశమని నమ్ముతున్నామని విపక్షనేతలు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విపక్ష నేతలు లేఖలో పేర్కొన్నారు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారన్నారు. ఈడీ, సీబీఐ కేసులో ఉన్న వాళ్లు బీజేపీలో చేరితే క్లీన్‌ చిట్ ఇస్తున్నారని తెలిపారు. మోడీకి లేఖ రాసిన వారిలో కేసీఆర్, మమత, స్టాలిన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ ఉన్నారు.


Full View


Tags:    

Similar News