ఆ విషయంలో నేనెంతో బాధ పడ్డా : కమల్‌నాథ్‌

మొన్నటిదాకా మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి అనుభవించి పార్టీలో జరిగిన అనుహ్య పరిణామాలతో పదవి కోల్పోయారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాధ్.

Update: 2020-05-04 09:54 GMT
kamal nath(file photo)

మొన్నటిదాకా మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి అనుభవించి పార్టీలో జరిగిన అనుహ్య పరిణామాలతో పదవి కోల్పోయారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాధ్.. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.. బీజేపీ ప్రలోభాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగిపోయారని అన్నారు. ఈ విషయంలో బీజేపీ చేసిన పనికి తానెంతో బాధ పడ్డానన్నారు. అంతేకాదు బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగిపోతారని కలలో కూడా ఊహించలేకపోయానని చెప్పారు.

అయితే తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని అయినా కూడాప్రలోభాలు పెట్టడం తనకు తెలియదని కమల్‌నాథ్‌ అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనుంచి తగ్గిన సీట్లను భర్తీ చేస్తామని చెప్పిన ఆయన.. ఉపఎన్నికలో మెజారిటీ సీట్లు దక్కించుకొని అధికారం చేపడతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఖాళీ అయిన 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

రెండు నెలల కిందట సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తోపాటు 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. బీజేపీలో చేరేముందు వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు.. దీంతో వెంటనే స్పీకర్ కూడా వీరి రాజీనామాలను ఆమోదించడంతో ఈ స్థానాలకు ఖాళీ ఏర్పడింది.


Tags:    

Similar News