చైనాలో మళ్లీ లాక్‌డౌన్ ... పుట్టినిల్లు వూహాన్ మూసివేత
Coronavirus: తాజాగా 564 కేసులు నమోదు, జీరో కోవిడ్ పాలసీలో భాగంగా లాక్‌డౌన్
Coronavirus: పుట్టిన ఇంటిని మరువలేకపోతోంది కరోనా జీరో కోవిడ్ పేరుతో ఒక్క కేసు కూడా నమోదు కాకూడదంటూ చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేసు నమోదైనా ప్రభుత్వం లాక్‌డౌన్లు విధిస్తుండడంతో అక్కడి ప్రజలు వణికిసోతున్నారు. తాజాగా వూహాన్, జియాంగ్జియాలలో 564 నమోదయ్యాయి. దీంతో దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూసేసింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఎన్నాళ్లనేది స్పష్టంగా తెలియడం లేదు. ఉన్నట్టుండి ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా తెలిపి ఉంటే నిత్యావసరాలైనా కొనుగోలు చేసేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.