Little Gold Smugglers: చిన్న బంగారం దొంగలు
Little Gold Smugglers: సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న..చీమల దండు గొలుసు తరలింపు
Little Gold Smugglers: చీమలు సాధారణ కీటకాలు.. కానీ.. మనుషులకు సాధ్యం కాని.. ఐక్యత, క్రమశిక్షణను అవి ప్రదర్శిస్తాయి. కలసికట్టుగా పెద్ద పెద్ద పుట్టలను నిర్మిస్తాయి. భారీ వస్తువులను లాక్కెళ్లడం కూడా కొత్తేమీ కాదు. అయితే బంగారు గొలుసును తీసుకెళ్తున్న చీమల వీడియో తాజా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇండియన్ పారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. బంగారు గొలుసును చీమల దండు తరలిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ చిన్న బంగారం స్మగ్లర్లను ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి? అని సుశాంత నంద ట్యాగ్ చేశారు. చీమల వీడియోని చూసి.. ఔరా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
చీమల రాణి కోసం ఈ గొలుసును తరలిస్తున్నాయని కొందరు.. టీమ్ వర్క్, హార్డ్ వర్క అని ఇలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఎప్పుడిది? అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. ఈ వీడియో పాతదేనని కొందరు చెబుతున్నారు.