Driving License Aadhaar Link: డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ లింక్ చేశారా..!
Driving License Aadhaar Link: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి డూప్లికేషన్ చాలా వేగంగా పెరిగింది.
Driving License Aadhaar Link: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి డూప్లికేషన్ చాలా వేగంగా పెరిగింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధంగానైనా డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో జరుగుతున్న మోసాలని, అవినీతి అరికట్టవచ్చని భావించింది. భారతీయ పౌరులందరికీ ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. దీని సహాయంతో మనం అనేక ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుతో లింక్ చేయడం కూడా తప్పనిసరి చేశారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పనులను చాలా రోజులుగా నిలిపివేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన పనులు చాలా రాష్ట్రాల్లో మళ్లీ ప్రారంభమయ్యాయి. మీరు డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయాలనుకుంటే ఆందోళన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని సులువుగా చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.
1. ముందుగా మీ రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. తర్వాత 'లింక్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయాలి.
3. తర్వాత డ్రాప్-డౌన్‌లోకి వెళ్లి 'డ్రైవింగ్ లైసెన్స్' ఎంపికపై క్లిక్ చేయాలి.
4. తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి.
5. తర్వాత 'గెట్ డిటైల్స్' ఎంపికపై క్లిక్ చేయాలి.
6. తర్వాత మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
7. తర్వాత మీరు 'సమర్పించు' ఎంపికపై క్లిక్ చేయాలి.
8. తర్వాత SMS ద్వారా మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
9. ఈ OTPని నమోదు చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను లింక్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది.