LIC: పాలసీదారుల్ని ఆదుకునేందుకు ఎల్‌ఐసీ మరో నిర్ణయం
LIC: ప్రీమియం చెల్లించలేక రద్దయిన పాలసీల పునరుద్ధరణకు మరోసారి ఛాన్స్
LIC: కష్టకాలంలో వ్యక్తిగత పాలసీదారుల్ని ఆదుకునేందుకు ఎల్‌ఐసీ మరో నిర్ణయం తీసుకుంది. ప్రీమియం చెల్లించలేక రద్దయిన పాలసీల పునరుద్ధరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి అవకాశం కల్పించింది. ఈ నెల 7న ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక క్యాంపెయిన్ మార్చి 25 వరకు కొనసాగుతుందని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఈ పాలసీల ప్రీమియం బకాయిల చెల్లింపుల్లోనూ పాలసీదారులకు 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పించింది. అయితే ఈ రాయితీ రూ.2,000 నుంచి రూ.3,000 పరిమితికి లోబడి ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లించడం ఆపేసే నాటికి ఆ పాలసీ గడువు పూర్తి కాకూడదని ఎల్‌ఐసీ షరతులు పెట్టింది.