సింగర్ సిద్దూ హత్యకు తిహార్ జైల్లో ప్లాన్?.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్..
Punjab: సిద్దూను తామే చంపేసినట్టు బిష్ణోయ్ సన్నిహితుడు వెల్లడి
Sidhu Moose Wala Murder Case: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాల హత్య సంచలనం సృష్టిస్తోంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్దూను చంపేందుకు దుండగులు 30 సార్లకు పైగా కాల్పులు జరిపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాకే నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు తిహార్ జైలులోనే పథకం రచించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ ప్రమేయం ఉందని పోలీసులు సందేహిస్తున్నారు. ఇప్పుడు బిష్ణోయ్ ఓ కేసు విషయంలో తీహార్ జైలులో శిక్షణు అనుభావిస్తున్నాడు. సిద్దూను తామే చంపేసినట్టు బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడైన మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో తీహార్ జైల్లోనే ఈ హ్యతకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
సిద్దూ స్నేహితులతో కలిసి కారులో వెళ్లాడు. అతడి కారు జవహార్‌కే గ్రామానికి చేరుకోగానే వెనుక నుంచి, ముందు నుంచి కార్లు వచ్చి అడ్డుకున్నాయి. డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్ధూపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. 30 సార్లకు పైగా కాల్పులు జరిపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అతడిని కసిగా చంపేసినట్టు స్పష‌్టమవుతోంది. అయితే సిద్దూ నిర్లక్షమే ప్రాణాలు తీసిందని పోలీసులు చెబుతున్నారు. సిద్దూకు బుల్లెట్ ఫ్రూప్ కారు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ కాకుండా సాధారణ కారులో బయటకు వెళ్లాడు. ఆ నిర్లక్ష్యమే అతడి ప్రాణాలను బలిగొంది.
సిద్దూ మూసేవాల అసలు పేరు సుబ్‌దీప్ సింగ్ సిద్దూ ఈ సింగర్ మొదటి నుంచీ వివాదాలు, విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గన్ కల్చర్‌తో పాటు గ్యాంగ్‌స్టర్లను హీరోలుగా అభివర్ణిస్తూ పాటలు పాడేవాడు. నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటించిన సిద్దూ అతడు చేసిన ఆల్బమ్స్‌లో హింసను ప్రేరేపించేవే ఎక్కువగా ఉన్నాయి. అభ్యంతరకర కంటెంట్‌తోనూ విమర్శలను ఎదుర్కొన్నాడు. సిగ్గు తెగ వీరుల్ని అవమానించేలా ఉండడంతో గతంలో క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక కరోనా సమయంలో తనకున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి తుపాకీలను తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ విషయమై ఆయుధ చట్టం, ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం కేసులు నమోదయ్యాయి. అయితే ఆ సమయంలో అరెస్టుకు బయపడి.. కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు. అయితే బెయిల్ దొరకగానే బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణలో ఉంది.
2021 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్దూ మూసేవాల కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మాన్సా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగాడు. ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓటమి పాలయ్యాడు. సిద్దూపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడి మృతి అభిమానులను దిగ్ర్బాంతికి గురి చేసింది. అయితే సిద్దూ మృతికి సీఎం భగవంత్ మన్ భద్రతను ఉప సంహరించుకోవడమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పంజాబ్ ప్రభుత్వం 424 మందికి భద్రతను ఉపసంహరించుకుంది. అయితే కొందరికి మాత్రం పూర్తిగా భద్రతను ఉప సంహరించుకోలేదు. అందులో సిద్దూ కూడా ఉన్నాడు. అతడికి నలుగురు సెక్యూరిటీ అధికారులు ఉండగా ఇద్దరిని మాత్రమే తొలగించారు. ఇక దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని సీఎం భగవంత్ మన్ స్పష్టం చేశారు.