Delhi Liquor Scam: ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు
Delhi Liquor Scam: న్యూఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్‌లో సమావేశమయ్యాం
Delhi Liquor Scam: ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెలుగుచూశాయి. 2021 మార్చిలో అరుణ్‌పిళ్ళై ఇండో స్పిరిట్ గ్రూప్ జాయింట్ వెంచర్ కోసం తనను సంప్రదించినట్టు తెలిపారు బుచ్చిబాబు. ఈ అంశంపై పలుమార్లు సమీర్ మహేంద్రుతో చర్చలు జరిపామని అన్నారు. న్యూఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్‌లో ఆప్ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌తో అరుణ్ పిళ్ళై, తాను సమావేశమైనట్టు బుచ్చిబాబు చెప్పారు. ఈ ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విజయ్ నాయర్ అని అరుణ్ పిళ్ళై తనతో చెప్పారని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, వ్యాపారులకు లాభం ఉండేలా మద్యం పాలసీ తయారుచేస్తున్నట్టు విజయ్ నాయర్ తనతో చెప్పారని తెలిపారు. ఈ పాలసీలో భాగస్వామ్యం కావాలని తనను కోరారని అన్నారు బుచ్చిబాబు. ఫ్లాట్ లైసెన్స్, వినియోగం ఆధారిత లైసెన్స్‌లో ఉన్న పాలసీ లోపాలను విజయ్ నాయర్‌కు చెప్పానని బుచ్చిబాబు అన్నారు. మాగుంట గ్రూప్‌ను తనకు పరిచయం చేయాలని సమీర్ మహేంద్రు.. తనను కోరాడని, దాంతో మాగుంట ఇంటికి తీసుకెళ్లి రాఘవను పరిచయం చేశానని బుచ్చిబాబు స్పష్టం చేశారు.